10,222 మిర్చి టిక్కీల విక్రయం
ABN, First Publish Date - 2020-12-11T05:30:00+05:30
మిర్చియార్డుకు శుక్రవారం మొత్తం 10,750 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 10,222 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం మొత్తం 10,750 మిర్చి టిక్కీలు రాగా యార్డులో నిల్వ ఉన్న వాటితో కలిపి 10,222 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా యార్డులో 41,632 టిక్కీలు నిల్వ ఉన్నాయి. శుక్రవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.6,000, గరిష్టంగా రూ.9,800, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.6,000, రూ.14,000, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.3,000, రూ.4,500 ధర లభించింది. ఏసీ కామన్ వెరైటీలకు రూ.7,000, రూ.15,500, ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.16,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500 ధర లభించినట్లు సెక్రెటరీ ఎం.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
Updated Date - 2020-12-11T05:30:00+05:30 IST