ఏకగ్రీవాలను రద్దుచేసి ఎన్నికలు పెట్టాలి
ABN, First Publish Date - 2020-03-16T07:16:38+05:30
బెదిరించి, భయపెట్టి ఏకగ్రీవాలను చేసుకొన్న స్థానిక సంస్థల స్థానాల ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి డిమాండ్‌చేశారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి
గుంటూరు, మార్చి 15: బెదిరించి, భయపెట్టి ఏకగ్రీవాలను చేసుకొన్న స్థానిక సంస్థల స్థానాల ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి డిమాండ్‌చేశారు. గుంటూరు రాజీ వ్‌గాంధీ భవన్‌లో ఆదివారం ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లా డారు. వైసీపీ అరాచకాలపై ఇప్ప టికే రాష్ట్ర ఎన్నికల కమిషన్, గవ ర్నర్‌కు, డీజీపీకి ఫిర్యాదులు చేశా మన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదుల ఫలి తంగానే ఎన్నికలు వాయిదా వేశార న్నారు. అయితే ఎన్నికలు వాయిదా వేయటం కాదని, ఏకంగా రద్దు చేయాలని డి మాండ్‌చేశారు.
ప్రజాసంక్షేమ పాలనపై దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఏకగ్రీవాలు లేకుండా అధికార వైసీపీ ఎన్నికలకు రావాలని పిలుపుని చ్చారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ అత్యంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించాలనుకోవటం అప్రజా స్వామికమన్నారు. ఇటువంటి భయానక ఎన్ని కల వాతావరణం ఎప్పుడూ చూడ లేదని ఆందోళన వ్యక్తంచేశారు. తక్ష ణమే ఎన్నికలను రద్దుచేసి తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించా లన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మో హన్‌రెడ్డి,నాయకులు సవరం రోహి త్, సుభాని,ఉస్మాన్, బొట్ల బ్రహ్మం, రెహమాన్ తదితరులున్నారు.
Updated Date - 2020-03-16T07:16:38+05:30 IST