ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి ఇంట్లోకి ప్రియుడు.. దొంగ అనుకుని పోలీసులకు సమాచారం అందించగా..

ABN, First Publish Date - 2020-09-14T08:54:54+05:30

యువతి ప్రేమను తిరస్కరించిందనే కారణంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంకొండ(గుంటూరు): యువతి ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండంలోని న్యూచిట్యాలలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సబంధించి ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలివి.. బాపట్ల పట్టణానికి చెందిన వడ్లమూడి గోపినాథ్‌(30) ఓ స్కూల్‌లో డ్యాన్సర్‌గా పనిచేసేవాడు. అదే పాఠశాలలో రేపల్లెకు చెందిన యువతి డ్యాన్స్‌ నేర్చుకునేందుకు వచ్చింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. గోపినాథ్‌ వేరే అమ్మాయితో పరిచయం అయిందనే కారణంతో ఈ యువతి దూరమైంది.


ప్రస్తుతం ఆమె న్యూ చిట్యాలలో పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. గోపినాథ్..‌ యువతికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అందుబాటులోకి రాకపోవడంతో ఆదివారం ఉదయం న్యూచిట్యాల గ్రామంలో యువతి నివశిస్తున్న ఇంటి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆ యువతి ఇంటికి గడియపెట్టి కూరగాయలు కొనేందుకు దగ్గరలో దుకాణం వద్దకు వెళ్లింది. గోపినాథ్‌ ఆమె ఇంట్లోకి వెళ్లడం గమనించిన ఇరుగుపొరుగువారు దొంగ వచ్చాడని భావించి బయట గడియపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు భయంతో గదిలోపలే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఎస్‌ఐ తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-09-14T08:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising