వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు వరం : ఉపసభాపతి కోన రఘుపతి
ABN, First Publish Date - 2020-12-30T05:58:58+05:30
వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు వరంగా మారిందని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. మంతెనవారిపాలెం, పిట్టలవానిపాలెంలోని ఎస్టీ కాలనీలో మంగళవారం ఇళ్ళస్థలాల పట్టాలను ఆయన పంపిణీ చేశారు.
పిట్టలవానిపాలెం, డిసెంబరు 29: వైసీపీ ప్రభుత్వం నిరుపేదలకు వరంగా మారిందని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. మంతెనవారిపాలెం, పిట్టలవానిపాలెంలోని ఎస్టీ కాలనీలో మంగళవారం ఇళ్ళస్థలాల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమఫలాలు అందిస్తున్న నాయకులను ఎల్లప్పుడు మరవరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షేక్.సుభానీ, తహసీల్దార్ బి.విఆర్.సి.హెచ్ ప్రసాద్, ఇవోపీఆర్డీ కె.పద్మజ, ఆర్‌ఐ కె.శ్రీనివాసరావు, కార్యదర్శి డి.కృష్ణమూర్తి, వీఆర్వో రమేష్‌బాబు, స్థానిక వైసీపీనాయకులు నర్రా శ్రీనివాసరావు, బొరు గడ్డ ఆధం, కొర్లపాటి కోటయ్య, దొంతిబోయిన నాగేశ్వరరావు, నర్రా సుబ్బారావు, చేబ్రోలు మోహనరావు, నీలా కృపారావు, యల్లాప్రగడ శేషుబాబు, మార్కెట్‌యార్డు వైస్‌ఛైర్మన్ ఉయ్యూరి లీలా శ్రీనివాసరెడ్డి, రాష్ట్రవైసీపీ మైనార్టీసెల్ కార్యదర్శి షేక్.అహ్మద్ హుస్సేన్ మండేవిజయ్‌కుమార్, గోవతోటి విజయబాబు, బడుగు ప్రకాశరరావు, ఫారె ధనుంజయరావు, బొలగాని సుబ్బారావు, పులుగు శ్రీనివాసరెడ్డి, వాలి శివరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం జయంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ళ పట్టాలు : ఉపసభాపతి కోన రఘుపతి
కర్లపాలెం, డిసెంబరు 29: మండలంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ళపట్టాలను అందజేస్తున్నామని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. ఆయన ముఖ్యఅతిథిగా గణపవరం, చింతాయపాలెం, పెదపులుగువారిపాలెం, నర్రావారిపాలెం గ్రామాలలోని లబ్దిదారులకు ఇళ్ళపట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉషారాణి, తహసీల్దార్ మోహనరావు, అమోక్, నాయకులు తాండ్ర సాంబశివరావు, పిట్ల వేణుగోపాలరెడ్డి, చీరాల సత్యనారాయణరెడ్డి, తిమ్మరాజు భార్గవ, మరకా వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T05:58:58+05:30 IST