ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన గోపాలస్వామి

ABN, First Publish Date - 2020-12-06T05:47:34+05:30

గ్రామీణ ప్రాంత విలేకరుల హక్కుల సాధన కోసం నిర్విరామ కృషి చేసి పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన పీవీవీ గోపాలస్వామి ఆదర్శప్రాయులని ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ అన్నారు.

పీవీవీ గోపాలస్వామికి నివాళులర్పిస్తున్న దేవులపల్లి అమర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు అమర్‌ 


 తెనాలి టౌన్‌, డిసెంబరు 5: గ్రామీణ ప్రాంత విలేకరుల హక్కుల సాధన కోసం నిర్విరామ కృషి చేసి పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన పీవీవీ గోపాలస్వామి ఆదర్శప్రాయులని ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ అన్నారు. శనివారం ఉదయం సీనియర్‌ పాత్రికేయుడు, ఏపీయుడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు పీవీవీ గోపాలస్వామి సంస్మరణ సభ స్థానిక గౌతమ్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించారు. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఏపీయుడబ్ల్యూజే బలోపేతానికి గోపాలస్వామి ఎంతో గొప్పగా పని చేశారని, రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన చరిత్రను గుర్తు చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ గోపాలస్వామి విగ్రహాన్ని తెనాలి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, మహిళ కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌ తదితరులు గోపాలస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి శాఖ అధ్యక్షుడు చందు సుబ్బారావు, విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మీరావలి, ఏచూరి శివ, ఎలకా్ట్రనిక్‌ మీడియా కార్యదర్శి మార్కండేయులు, బీఎల్‌ నారాయణ, తెనాలి శాఖ కార్యదర్శి సీహెచ్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-06T05:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising