ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొల్లా అవినీతిని నిరూపిస్తా..

ABN, First Publish Date - 2020-07-05T10:22:33+05:30

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఇచ్చిన 100 ఎకరాల్లో కొంత పోరంబోకు, కొంత పట్టా భూమి ఉందని.. దాన్ని తాము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు


వినుకొండటౌన్‌, జూలై 4: ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఇచ్చిన 100 ఎకరాల్లో కొంత పోరంబోకు, కొంత పట్టా భూమి ఉందని.. దాన్ని తాము నిరూపిస్తామంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్‌ విసిరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వినుకొండ నుంచి 7కిలోమీటర్ల దూరంలో భూములు ఇచ్చి రెండు కిలోమీటర్లు ఉందనడం విడ్డూరంగా ఉందన్నారు.


వీసీ నరసింహారెడ్డి భూ సెటిల్మెంట్‌లో న్యాయం చేయాలని కోరితే ఆ భూమిని నువ్వు తక్కువ ధరకు కొట్టేయలేదా అని ప్రశ్నించారు. ఇకనైనా మీ దోపిడీ ఆపాలన్నారు. వల్లభ డెయిరీ సైతం తెలుగుదేశం హయాంలోనే పెట్టింది కాదా అని ప్రశ్నించారు. మీ పాలనపై మీ పార్టీ నాయకులే భయపడుతున్నారని తెలిపారు. పట్టణానికి మౌలిక వసతులు గల భూముల్లో మాత్రమే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆదివారం ఉదయం పేదల పక్షాన నిలిచి పేదలకు అనువైన భూమిని పంపిణీ చేయాలని భౌతిక దూరం పాటిస్తూ స్వగృహంలో దీక్షలు చేపడతానని హెచ్చరించారు. పిట్టంబండ గ్రామంలో ఓ దళితుని భూమి లాక్కొని ప్లాట్లు ఏర్పాటు చేశారని, ఇదే తరహాలో నీ భూమి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని లాక్కొని పేదలకు పట్టాలు ఇస్తావా అంటూ ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సైదారావు, షమీమ్‌, వజ్రాల కృష్ణారెడ్డి, పల్లమీసాల దాసయ్య తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-07-05T10:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising