ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి జగన్న విద్యాకానుక పంపిణీ

ABN, First Publish Date - 2020-10-08T09:10:51+05:30

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గురువారం నుంచి జగనన్న విద్యాకానుక కిట్స్‌ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(విద్య): జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గురువారం నుంచి జగనన్న విద్యాకానుక కిట్స్‌ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జగనన్న విద్యాకానుకలు ఎంఆర్‌సీల నుంచి పాఠశాలలకు చేరాయి.


జిల్లాలోని 57 మండలాలకు 12,81,785 నోట్‌పుస్తకాలు, 53 మండలాలకు 2,02,544 షూలు, 56 మండలాలకు 3,33,744 బ్యాగులు, ఒకటి నుంచి 8వ తరగతి 53,935 జతల దుస్తులు, 9, 10 తరగతుల విద్యార్థులకు 71,628 జతల యూనీఫాం సిద్ధమయ్యాయి. వీటిని ఒక కిట్‌గా చేసి విద్యార్థులను అందజేయాలని అధికారులు నిర్ణయించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు తరగతి వారీగా పంపిణీ చేయాలని  స్కూల్‌ మేనేజమెంట్‌ కమిటీలకు సమాచారం అందజేశారు. 


 ప్రతి రోజు 50 మందికి పంపిణీ చేయాలని డీఈవో గంగాభవాని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాస్కులు ధరించాలని, వారికి శానిటైజర్స్‌ పంపిణీ చేయాలన్నారు. కిట్స్‌ పంపిణీ చేసే ముందు యాప్‌లో విద్యార్థుల తల్లుల బయోమెట్రిక్‌ తీసుకున్న తరువాతనే పంపిణీ చేయాలని సూచించారు.  


Updated Date - 2020-10-08T09:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising