7,281 గొర్రెలు/మేకల యూనిట్ల ఏర్పాటు లక్ష్యం
ABN, First Publish Date - 2020-12-11T06:22:12+05:30
జిల్లాలో 7,281 గొర్రెలు/మేకల యూనిట్లని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపారు.
గుంటూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 7,281 గొర్రెలు/మేకల యూనిట్లని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ చేయూత - జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు/మేకల యూనిట్ల పంపిణీకి సీఎం జగన్ ఆన్‌లైన్‌లో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే 1,019 గ్రౌండింగ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వీ లక్ష్మణరెడ్డి, జేసీలు ఏఎస్ దినేష్‌కుమార్, పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, విడదల రజని, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎం శ్రీనివాస్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ కామేశ్వరరావు, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కస్పారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్‌నాయక్, మెప్మా పీడీ బాలయ్య, ఎల్‌డీఎం ఈదర రాంబాబు, జిల్లా సమాఖ్య అధ్యక్షుడు ఆలేటి అనుష్క, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
సేవలతో రోగులకు సంతృప్తి కలిగించాలి
గుంటూరు(మెడికల్): గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మంచి వైద్యం అందించి వారు సంతృప్తికరంగా వె ళ్లేలా వైద్యులు కృషి చేయాలని హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) చైర్మన్, కలెక్టర్ ఆనంద్‌కుమార్ కోరారు. గురువారం ఆసుపత్రి శుశృతహాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో జేసీ ప్రశాంతి, డీఎంహెచ్‌వో డాక్టర్ జే యాస్మిన్, డీసీహె చ్‌ఎస్ డాక్టర్ ఈశ్వర ప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ బాబులాల్, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, హెచ్‌డీఎస్ సభ్యులు ఆళ్లగడ్డ రామారావు, రాజ సుందరంబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T06:22:12+05:30 IST