ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో విద్యుత్‌ వ్యవస్థపై తనిఖీలు

ABN, First Publish Date - 2020-08-11T09:41:33+05:30

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి అగ్నిప్రమాదంతో పాటు విజయవాడలోని ప్రైవేటు హోటల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరింగ్‌ను పరిశీలిస్తోన్న సిబ్బంది


గుంటూరు, ఆగస్టు 10: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి అగ్నిప్రమాదంతో పాటు విజయవాడలోని ప్రైవేటు హోటల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద దుర్ఘటనలతో విద్యుత్‌ యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు టౌన్‌-1 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) జె హరిబాబు నేతృత్వంలో సోమవారం గుంటూరు నగరంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ను సందర్శించి విద్యుత్‌ భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు.


నగరంలో ఇప్పటికే పలు ప్రైవేటు హాస్పటల్స్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేశాయి. ఆయా వివరాలను సేకరించి సెంటర్స్‌లో విద్యుత్‌ పరమైన భద్రతా చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక అధికారులు, సిబ్బంది విద్యుత్‌ మీటర్ల నుంచి కోవిడ్‌ -19 కేర్‌ సెంటర్‌లో వైరింగ్‌ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌కు అనువుగా ఉంటుందో, లేదో అనే అంశాలను పరిశీలించి తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-11T09:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising