ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యంపైనే ప్రపంచ భవిష్యత్తు

ABN, First Publish Date - 2020-07-05T10:21:35+05:30

దేశ, ప్రపంచ భవిష్యత్తు ఆరోగ్య రంగంపైనే ఆధారపడి ఉందని విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు. వడ్లమూడిలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య 


గుంటూరు, జూలై 4: దేశ, ప్రపంచ భవిష్యత్తు ఆరోగ్య రంగంపైనే ఆధారపడి ఉందని విజ్ఞాన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు. వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో రీసెంట్‌ ట్రెండ్‌ ్స ఇన్‌ డ్రగ్‌ డిస్కవరీ, డయాగ్నస్టిక్స్‌ అండ్‌ థెరపిటిక్స్‌ ఏ స్పెషల్‌ ఎంఫసిస్‌ అన్‌ కోవిడ్‌-19’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ ఔషద మొక్కలపై పరిశోదనలు పెంచటం ద్వారా కొత్త రసాయనాలను కనిపెట్టి కరోనాను నియంత్రించవచ్చన్నారు.


బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎస్‌ కృపానిది మాట్లాడుతూ వ్యాక్సిన్‌లు త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారన్నారు. ఈ కాన్ఫ్‌రెన్స్‌లో యుఎస్‌ఏ, యూకే, ఫ్రాన్స్‌, జెరూసలెం, ఆస్ట్రేలియా, పాలస్తీనా, ఆల్జీరియా, స్పెయిన్‌ దేశాల నుంచి 9 మంది ప్రొఫెసర్లు, ఇతర రాష్ట్రాల నుంచి మరో 8 మంది ప్రొఫెసర్లు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ ఎంఎస్‌.రఘునాథన్‌, డీన్‌ స్డూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ ఎంఎస్‌ఎస్‌ రుక్మిణి, కన్వీనర్‌లు ప్రొఫెసర్‌ టీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ కే అబ్రహాం పీలే, ఆయా విభాగాల డీన్‌లు, అధిపతులు ఉన్నారు. 

Updated Date - 2020-07-05T10:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising