ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని వర్గాలను మోసం చేశారు: నక్కా ఆనంద్‌బాబు ధ్వజం

ABN, First Publish Date - 2020-03-08T08:50:20+05:30

అధికారంలోకి వచ్చిన నాటినుంచి అన్ని వర్గాలను మోసం చేయడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. రాజధాని తరలింపునకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(తూర్పు), మార్చి7: అధికారంలోకి వచ్చిన నాటినుంచి అన్ని వర్గాలను మోసం చేయడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలక్టరేట్‌ ఎదుట జేఏసీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  శనివారం 70 వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ అమరావతి విషయంలో యావత్‌ రాష్ట్రాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో బీసీలను వంచించారని ఆరోపించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులును దారి మళ్ళించి వారికి మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కంటే రాజకీయ భవిష్యత్తుకే ముఖ్యమంత్రి అధిక ప్రాఽధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మన్నవ సుబ్బారావు, లింగంశెట్టి ఈశ్వరరావు, సవరం రోహిత్‌ పాల్గొనగా దీక్షలలో దామచర్ల శ్రీనివాసరావు, సంపత్‌కుమార్‌, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, గోపీనాథ్‌, వెంకటేశ్వరరావు, సాంబమూర్తి, శివబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T08:50:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising