ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో వివాదంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి

ABN, First Publish Date - 2020-12-11T14:31:16+05:30

వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి మరో వివాదంలో చిక్కుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి మరో వివాదంలో చిక్కుకున్నారు. రేవతి మేనల్లుడు వైద్య సిబ్బందిపై దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. దాచేపల్లిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం సిబ్బందిపై దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రేవతి మేనల్లుడు వడియరాజు దాడి చేసిన వీడియో అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వడియరాజు  వైద్యం చేయించుకుని బిల్లు కట్టకుండా దాడికి దిగినట్లు తెలుస్తోంది.


అత్త అలా.. అల్లుడు ఇలా!

దీంతో అత్త రేవతి అలా వివాదాల్లో నిలుస్తుంటే.. అల్లుడు వడియరాజు ఇలా దాడులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్న రేవతి.. ఇప్పటి వరకూ తాజా వివాదంపై స్పందించనలేదు. వడియరాజు కూడా దీనిపై స్పందించలేదు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రేవతిపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఏంటో.. మరి.!


కాగా.. నిన్న కాజ టోల్‌ప్లాజా వద్ద టోల్ ఫీజ్ కట్టమంటూ కారు ఆపడంతో టోల్ సిబ్బందిపై రేవతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కారునే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై చేయిచేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో వివాదం వెలుగుచూసింది.

Updated Date - 2020-12-11T14:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising