ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-10-27T07:58:14+05:30

మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మరో 26 మందిపై కూడా..


 రెంటచింతల, అక్టోబరు 26: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత యరపతినేని శ్రీనివాసరావుపై రెంటచింతల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 23న ఆయన రెంటచింతల పర్యటనలో భాగంగా స్థానిక టీడీపీ నేత, మృతి చెందిన బోయిన నర్సయ్య యాదవ్‌ కుటుంబీకులను పరామర్శించారు. ఆ సందర్భంలో యరపతినేని పోలీసుల మానసిక స్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారని కానిస్టేబుల్‌ ఇమ్మడిశెట్టి పవన్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనతో పాటు మరో 26మందిపైనా ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  యరపతినేనిపై నమోదు చేసిన కేసులో మిగిలిన 25మంది పేర్లను సోమవారం రాత్రి పోలీసులు వెల్లడించారు.


బోయిన మల్లయ్య, చపారపు అబ్బిరెడ్డి, యరపతినేని మట్టయ్య, ఏరువ జోజిరెడ్డి, నల్లబిరుదు నరసింహారావు, పోలా నాగార్జున, మూలి రాజారెడ్డి, ముని నాయక్‌, నీలం మల్లయ్య, చేర్రెడ్డి కృష్ణారెడ్డి, దొండపాటి శివనాగు, మణికంఠ, నల్లమడుగు అనిల్‌, పోట్ల సురేష్‌, బ్రహ్మంగౌడ్‌, బాలునాయక్‌, తొడిచర్ల థామస్‌, త్రిపుర గోవర్ధనరావు, కోరే నాగేశ్వరరావు, తోడిచర్ల సైదులు, దేరంగుల వెంకటరాజ, తమ్మిశెట్టి శ్రీరాములు, మున్నా ప్రభురాజు, మున్నా లింగయ్య, మున్నా శ్రీను తదితరులపై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చల్లా సురేష్‌ చెప్పారు.

Updated Date - 2020-10-27T07:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising