ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి రైతులకు మద్దతు ధర

ABN, First Publish Date - 2020-10-27T07:55:57+05:30

పత్తి రైతులకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇప్పిస్తామని ఏపీ సీసీఐ జీఎం జీఎస్‌ సాయిఆదిత్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


గుంటూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇప్పిస్తామని ఏపీ సీసీఐ జీఎం జీఎస్‌ సాయిఆదిత్య తెలిపారు. గుంటూరు అశోక్‌నగర్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తి కనీస మద్దతు ధర రూ.5,496 నుంచి రూ.5,825గా నిర్ణయించినట్లు చెప్పారు. రైతుభరోసా కేంద్రాల్లోనే వారంలో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. మార్కెట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేశామన్నారు. కొనుగోలు పూర్తయిన వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బు జమచేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యను అధికారులు, బయ్యర్లు అభినందించారు. అనంతరం ఆదిత్య మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్నతో చుట్టుగుంట సెంటర్‌లోని కార్యాలయంలో భేటీ అయ్యారు.   

Updated Date - 2020-10-27T07:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising