ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగనోట్ల కేసులో ఏడుగురికి జైలు, జరిమానా

ABN, First Publish Date - 2020-10-07T09:37:29+05:30

దొంగనోట్ల తయారీకేసులో నేరం రుజువుకావటంతో గురజాల పదో అదనపు జిల్లాకోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి, నరసరావుపేట 13వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూరి కె. శ్రీనివాసరావు మంగళవారం ఏడుగురికి జరిమానా, జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురజాల లీగల్‌, అక్టోబరు 6: దొంగనోట్ల తయారీకేసులో నేరం రుజువుకావటంతో గురజాల పదో అదనపు జిల్లాకోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి, నరసరావుపేట 13వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూరి కె. శ్రీనివాసరావు మంగళవారం ఏడుగురికి జరిమానా, జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. జిల్లాకోర్టు ఏపీపీ కె.కాశీవిశ్వనాథం కథనం ప్రకారం మాచర్లకు చెందిన ఏడుకొండలు, షేక్‌ ఖయ్యుం, ఎస్‌.గణేష్‌, దుర్గికి జె. శ్రీనివాసరావు, రెంటచింతలకు చెందిన ఎన్‌.లక్ష్మయ్య, పిడుగురాళ్లకు చెందిన టి.గంగాధర్‌, డి.మల్లారెడ్డి, గుంటూరుకు చెందిన ఇ.విజయరత్నకుమార్‌లు  కలసి మాచర్ల రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఏడుకొండలు ఇంట్లో నకిలీనోట్లు తయారుచేసి చలామణి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మాచర్ల సీఐ సీహెచ్‌ వెంకటేశ్వర్లుకు  ఆ ఇంటిపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.


కేసునమోదు అనంతరం విచారణలో నకిలీనోట్ల తయారీకి ఉపయోగించే కంప్యూటర్‌, సామగ్రి, నకిలీనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో నలుగురిని  అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నకిలీ నోట్లు తయారుచేసి చలామణి చేసేందుకు సిద్ధంగా ఉన్న ఎనిమిది మందిపై కేసు నడుస్తుండగా రెండో నిందితుడు ఖయ్యుం మృతిచెందాడు. మిగిలిన ఏడుగురిపై నేరం రుజువుకావటంతో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా, మిగిలినవారికి నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. 

Updated Date - 2020-10-07T09:37:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising