ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నిందితుడు అరెస్టు

ABN, First Publish Date - 2020-10-04T06:39:21+05:30

తన అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో స్నేహితుడిని హతమార్చిన ఘటనలో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలిపారు. శనివారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పెదకాకాని మండలం అగతవరప్పాడు పంచాయతీ పరిఽధిలోని భవానిపురంలో రామకృష్ణ, వంశీ ఇద్దరు స్నేహితులు. రామకృష్ణ తన స్నేహితుడు వంశీ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదకాకాని, అక్టోబరు3: తన అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో స్నేహితుడిని హతమార్చిన ఘటనలో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ తెలిపారు. శనివారం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పెదకాకాని మండలం అగతవరప్పాడు పంచాయతీ పరిఽధిలోని భవానిపురంలో రామకృష్ణ, వంశీ ఇద్దరు స్నేహితులు. రామకృష్ణ తన స్నేహితుడు వంశీ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమెకు, తన భర్తకు తరచుగా గొడవలు అవుతున్నాయి.


తన అక్క కాపురంలో గొడవలు రావడానికి రామకృష్ణ అని భావించిన వంశీ గత నెల 28 రాత్రి అగతవరప్పాడు శివారులో రామకృష్ణపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో రామకృష్ణ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన పెదకాకాని సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, సిబ్బందిని నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గా ప్రసాద్‌ అభినందించారు. 

Updated Date - 2020-10-04T06:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising