ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ శ్రేణులపై బైండోవర్‌ కేసులు దారుణం

ABN, First Publish Date - 2020-10-04T06:37:44+05:30

దేవాలయాల పరిరక్షణలో భాగంగా టీడీపీ నాయకులపై బైండోవర్‌ కేసులు పెట్టి ఏదైన జరిగితే వారిని ముద్దాయిలుగా చేస్తామని హెచ్చరించటం దారుణమని టీడీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ 


బాపట్ల, అక్టోబరు 3: దేవాలయాల పరిరక్షణలో భాగంగా టీడీపీ నాయకులపై బైండోవర్‌ కేసులు పెట్టి ఏదైన జరిగితే వారిని ముద్దాయిలుగా చేస్తామని హెచ్చరించటం దారుణమని టీడీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. వేగేశన ఫౌండేషన్‌ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో నరేంద్రవర్మ మాట్లాడుతూ టీడీపీ పట్టణ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కూచిపూడి శ్యామ్‌సుందర్‌, ప్రధాన కార్యదర్శి విన్నకోట వీరయ్యనాయుడుపై పోలీసులు బైండోవర్‌ కేసు నమోదు చేశారన్నారు. దేవాలయాలపై వైసీపీ వారే ఏదో ఒకటి చేసి టీడీపీ వారిపై నెట్టాలనుకునే విషసంస్కృతిని విడనాడాలన్నారు.


  డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఇటువంటి వాటిని ఖండించాలన్నారు. దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. సీనియర్‌ నాయకుడు సలగల రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం టీడీపీవారిపై గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్‌ మాజీ చైర్మన్‌ తాతా జయప్రకాష్‌ నారాయణ, వడ్లమూడి వెంకటేశ్వరరావు, కూచిపూడి శ్యామ్‌సుందర్‌, విన్నకోట వీరయ్యనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T06:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising