డ్రైవర్లు డిజిటల్ కాపీలను చూపినా చాలు
ABN, First Publish Date - 2020-10-04T06:35:26+05:30
వాహన డ్రైవర్ల లైసెన్స్, రిజిస్ట్రేషన్ తదితర సిర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు, డ్రైవర్లు ఎలకా్ట్రనిక్ కాపీలను సమర్పించవచ్చని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ తెలియజేసింది.
గతంలో కేంద్ర మంత్రికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లేఖ
బదులు లేఖ రాసిన కేంద్ర మంత్రి
గుంటూరు, అక్టోబరు 3: వాహన డ్రైవర్ల లైసెన్స్, రిజిస్ట్రేషన్ తదితర సిర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు, డ్రైవర్లు ఎలకా్ట్రనిక్ కాపీలను సమర్పించవచ్చని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ తెలియజేసింది. సవరించిన మోటార్ వాహనాలు (సవరణ) చట్టం -2020 ప్రకారం నోటిఫై చేసిన భారీ జరిమానాలు, విద్యార్ధులు, తల్లిదండ్రులకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాహన పత్రాలను డిజిటలైజ్ చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గతేడాది మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ విషయంపై దృష్టి సారించి.. పత్రాలు డిజిటలైజ్ చేసినట్లు శ్రీకృష్ణదేవరాయలుకు బదులు లేఖ ద్వారా తెలియజేశారు. దీనిపై ఎంపీ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2020-10-04T06:35:26+05:30 IST