ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యత దెబ్బతీసేందుకు ఐదు కార్పొరేషన్లు

ABN, First Publish Date - 2020-10-04T06:32:42+05:30

కల్లుగీత కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఐదుముక్కలుగా చేసి ఐదు కార్పొరేషన్‌లుగా విభజించటం సరికాదని రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తాతా జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కల్లుగీత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తాతా జయప్రకాష్‌ నారాయణ 



బాపట్ల, అక్టోబరు 3: కల్లుగీత కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఐదుముక్కలుగా చేసి ఐదు కార్పొరేషన్‌లుగా విభజించటం సరికాదని రాష్ట్ర  కల్లుగీత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తాతా జయప్రకాష్‌ నారాయణ అన్నారు. బాపట్ల పట్టణంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ, చెట్టిబలిజ, శ్రీసైన, యాత, ఈడిగ అంటూ ఐదు కార్పొరేషన్‌లు ప్రకటించి బీసీల ఐక్యతను దెబ్బతీస్తున్నారన్నారు.


తెలుగుదేశం హయాంలో 2017-2018 సంవత్సరానికి రూ.35కోట్లు, 18-19 సంవత్సరానికి రూ.70కోట్లు నిధులు కేటాయించి కల్లుగీత కార్మికులకు 50శాతం సబ్సిడీ రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కూచిపూడి శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T06:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising