ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-03T11:17:54+05:30

నరసరావుపేటలోని లింగంగుంట్ల వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి భవనంలో కొవిడ్‌ వైద్యశాలను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ శుక్రవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేటి నుంచి కరోనా బాధితులకు వైద్య సేవలు


నరసరావుపేట, ఆక్టోబరు 2: నరసరావుపేటలోని లింగంగుంట్ల వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి భవనంలో కొవిడ్‌ వైద్యశాలను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవలు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయని ఎంపీ చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలు దీనిని సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.


ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆక్సిజన్‌ వసతి ఉన్న 150 బెడ్‌లు, 25 ఐసీయూ బెడ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2కెఎల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ సమకుర్చారన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 12 మంది వైద్య బృందానికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. కలెక్టర్‌ శా మ్యూల్‌ ఆనందకుమార్‌ మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజ లకు ఈ ఆస్పత్రి వరం అన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌నుపూర్‌, కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌  శ్రీనివాసరావు, డాక్టర్‌ మోహన్‌ శేషు ప్రసాదు, డాక్టర్‌ ఓరుగంటి శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T11:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising