254 మద్యం సీసాలు స్వాధీనం
ABN, First Publish Date - 2020-10-03T11:17:01+05:30
తెలంగాణా నుంచి అక్ర మంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అ దుపు లోకి తీసుకొని వారి నుంచి 254 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం ఎస్‌ఐ రాజానాయక్ శుక్రవారం తెలిపారు.
మాచవరం, అమరావతి: తెలంగాణా నుంచి అక్ర మంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అ దుపు లోకి తీసుకొని వారి నుంచి 254 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం ఎస్‌ఐ రాజానాయక్ శుక్రవారం తెలిపారు. మండలంలోని మోర్జంపాడు నుం చి గోవిందాపురం దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
మోర్జంపాడుకు చెందిన యామని వెంకట్రావు, రామి, కాకునూరి చినకొండ, నాదెండ్ల మండలం కనకొర్రుకు చెందిన షేక్ సుభానిని అదుపులోకి తీసుకుని, ఆటో ద్విచక్ర వాహనం సీజ్ చేసి నట్లు తెలిపారు. అమరావతి మండలంలోని లింగాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 200 మద్యం క్వార్టర్ సీసాలను పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు
Updated Date - 2020-10-03T11:17:01+05:30 IST