ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN, First Publish Date - 2020-10-02T07:15:30+05:30

జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 20 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, అక్టోబరు 1: జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో  నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 20 క్రస్ట్‌గేట్ల ద్వారా అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గురువారం నాటికి సాగర్‌ నీటిమట్టం 590.00 అడుగులు(312.04 టీఎంసీలు) ఉంది. కుడి కాలువ ద్వారా 8,755 క్యూసెక్కులు, 20 క్రస్ట్‌గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,62,000 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ 1800 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 5654 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28,948 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లోగా 2,07,757 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 2,07,757 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.70 అడుగులుంది. ఇది 213.88 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 83,587 క్యూసెక్కులు, రోజాల నుంచి 62,762 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 23,100 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. మొత్తం ఇన్‌ఫ్లోగా 1,69,449 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 

Updated Date - 2020-10-02T07:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising