ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలం యోధుడు కవి జాషువా

ABN, First Publish Date - 2020-09-29T10:36:54+05:30

సమాజంలోని అసమానతలు, రుగ్మతలు, కులవ్యవస్థను తన కవితలతో చీల్చి చెండాడిన కలం యోధుడు గుర్రం జాషువా దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మహాకవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

 ఘనంగా జాషువా జయంతి వేడుకలు


గుంటూరు (సాంస్కృతికం) సెప్టెంబర్‌ 28: సమాజంలోని అసమానతలు, రుగ్మతలు, కులవ్యవస్థను తన కవితలతో చీల్చి చెండాడిన కలం యోధుడు గుర్రం జాషువా దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మహాకవి గుర్రం జాషువా 125వ జయంతి సందర్భంగా సోమవారం నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశంతో గుంటూరు నడిబొడ్డులో గుర్రం జాషువా కళాపీఠం ఏర్పాటుకు 25 సెంట్ల స్థలంతో పాటు రూ.3 కోట్లు కేటాయించామన్నారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ జాషువా ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడేలా కళా ప్రాంగణం తీర్చిదిద్దుతామన్నారు.


మాజీమంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాట్లాడుతూ పల్నాడు లేదా గుంటూరు జిల్లాకు జాషువా జిల్లాగా నామకరణం చేసేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ బాలస్వామి, డీఈవో గంగాభవాని, తూర్పు  తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తదిరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-29T10:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising