ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలకడగా.. కరోనా

ABN, First Publish Date - 2020-09-28T11:04:01+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగానే కొనసాగుతోన్నది. ఆదివారం ఉదయం వరకు అందిన 6,564 శాంపిల్స్‌ ఫలితాల్లో 535 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా 535 మందికి పాజిటివ్‌

జిల్లాలో మరో ఐదుగురి మరణం


గుంటూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగానే కొనసాగుతోన్నది. ఆదివారం ఉదయం వరకు అందిన 6,564 శాంపిల్స్‌ ఫలితాల్లో 535 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 54,863 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. అలానే మరో ఐదుగురు ఆదివారం చనిపోగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 582కి పెరిగింది.


ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం 44,774 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 9,507(17.33 శాతం) మంది కొవిడ్‌తో పోరాడుతున్నారు. కొత్తగా 5,062 మంది శాంపిల్స్‌ని టెస్టింగ్‌ నిమిత్తం సేకరించారు. కాగా గుంటూరు నగరంలో ఆదివారం వరకు నమోదైన పాజిటివ్‌ కేసులతో ఇప్పటివరకు 15,254 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. జిల్లాలో రికవరీ రేటు 81.61 శాతానికి పెరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలానే ప్రతీ 10 లక్షల మంది జనాభాలో ఇప్పటివరకు 1,05,510 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కొత్తగా గుంటూరు నగరంలో 86, తెనాలి - 61, రేపల్లె - 35, తాడికొండ - 34, పెదకాకాని - 23, సత్తెనపల్లి - 18, మంగళగిరి - 11, తాడేపల్లి - 12, తుళ్లూరు - 10, దాచేపల్లి - 12, నాదెండ్ల - 21, నరసరావుపేట - 42, నకరికల్లు - 10, శావల్యాపురం - 18, బాపట్ల - 13, పొన్నూరు - 23, చుండూరులో 11 కేసులు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లో మరో 95 మందికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-09-28T11:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising