ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌కు జల కళ.. 18 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

ABN, First Publish Date - 2020-08-22T15:58:29+05:30

నాగార్జున సాగర్‌ జలాశ యం జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వరద నీరు చేరడంతో శుక్రవారం ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 586 అడుగులకు చేరుకుంది. ఇది 300.2 టీఎంసీలకు సమానం. దీంతో 18 క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌/గుంటూరు (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్‌ జలాశ యం జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వరద నీరు చేరడంతో శుక్రవారం ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 586 అడుగులకు చేరుకుంది. ఇది 300.2 టీఎంసీలకు సమానం. దీంతో 18 క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,38,240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్‌ఎల్‌ బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 2,712 క్యూసెక్కులు, ప్రఽధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 24,401 క్యూసెక్కులు మొత్తం ఔట్‌ఫ్లో 1,67,153 క్యూసెక్కు ల నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం నాగార్జున సాగ ర్‌ 14వ గేటు వద్ద ప్రాజెక్టు సీఈ నరసింహ పూజలు నిర్వ హించి స్విచ్‌ఆన్‌ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు ఎగువన ఆల్మ ట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం సంతరించుకున్నట్లు చెప్పారు. శ్రీశై లం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 4,07,570 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 883.50 అడుగులుంది. ఇది 207.41 టీఎంసీలకు సమానం. జూరాల, రోజాల నుంచి 3,83,354 క్యూసెక్కులు నీరు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో వాటర్‌గా వచ్చి చేరుతోంది. ఆయన వెంట ఆంధ్ర, తెలంగాణ ఇంజనీర్లు, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2020-08-22T15:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising