తేలే వరకు ఉద్యమం.. 248వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
ABN, First Publish Date - 2020-08-22T15:50:42+05:30
అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన మోసపూరిత ప్రభుత్వాలకు ఉద్యమమే సరైన సమాధానమని రైతు లు పేర్కొన్నారు. ఏకైక రాజ ధాని డిమాండ్‌తో రైతులు చేపట్టిన దీక్షలు శుక్రవారం 248వ రోజుకు చేరుకున్నాయి
మోసపూరిత ప్రభుత్వాలకు సమాధానం చెబుతాం..
తుళ్లూరు(గుంటూరు): అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెప్పి ఆ తరువాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన మోసపూరిత ప్రభుత్వాలకు ఉద్యమమే సరైన సమాధానమని రైతు లు పేర్కొన్నారు. ఏకైక రాజ ధాని డిమాండ్‌తో రైతులు చేపట్టిన దీక్షలు శుక్రవారం 248వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మా ట్లాడుతూ అమరావతిని కొనసాగించి అభివృద్ధి చేయమం టే కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ఆకు పచ్చ జెండాలు మెడలో ధరించిన మహిళలు, రైతు లు, రైతు కూలీలు దీక్షా శిబిరంలో కూర్చుని జై అమ రావతి అంటూ నినాదాలు చేశారు. రైతులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అనంతవరంలో రైతు దీక్ష శిబిరాన్ని మ హిళా జేఏసీ సభ్యురాలు డాక్టర్ రాయపాటి శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఉద్యమానికి పెద్దఎత్తున మద్దతు లభిస్తుందన్నారు.
దళిత జేఏసీ సభ్యులు పులి చిన్నా మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇటువైపు కన్నెత్తి కూడా చూ డటం లేదన్నారు. మరోనేత చిలకా బసవయ్య మా ట్లాడుతూ రైతులు మనోవేదనతో మృతి చెందుతుం టే వైసీపీ నాయకులు నవ్వుకోవటం దారుణమన్నా రు. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డి మాండ్ చేస్తూ తాడేపల్లి మండలం ఉండవల్లిలో జేఏసీ ఆధ్వర్యాన రైతులు, రైతుకూలీలు ప్లకార్డులు చేతబూని నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గాదె శ్రీనివాసరావు, శిగిరిశెట్టి శివుడు, లీలాకృష్ణ, వేములపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా రవితేజ, అప్పారావు, సతీష్, రైతులు, రైతు కూలీలు పా ల్గొన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రా మాల్లో రైతులు, మహిళలు, చిన్నారులు నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాజధాని వాసులను మోసం చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ యర్రబాలెం, ఉండవల్లి, కృష్ణాయపాలెం తదితర గ్రామాల రైతు లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అమరావతి తోనే రాష్ట్రానికి వెలుగంటూ మహిళా రైతులు అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Updated Date - 2020-08-22T15:50:42+05:30 IST