ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న రైతు భరోసాతో పాటు వరద సాయం

ABN, First Publish Date - 2020-10-24T10:30:22+05:30

రైతుభరోసా రెండో విడత సాయం తోపాటు సెప్టెంబరు లో కురిసిన భారీ వర్షా లతో జరిగిన పంటల నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సి డీని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టో బరు 23 (ఆంధ్ర జ్యోతి): రైతుభరోసా రెండో విడత సాయం తోపాటు సెప్టెంబరు లో కురిసిన భారీ వర్షా లతో జరిగిన పంటల నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సి డీని ఈ నెల 27న రైతులకు పంపిణీచేస్తామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీవర్షాలు, వరదలకారణంగా 18 మండ లాల్లోని 31 గ్రామాలు, 19 నివాసిత ప్రాంతాలు ప్రభావితమయ్యా యాన్నారు. 30,544 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారని తెలిపారు. వారిలో నలుగురి కుటుంబాలకు రూ.4 లక్షల వంతున నష్టపరిహారం అందజేశామన్నారు. మరొకరికి కూడా సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.


వరదల్లో 148 ఇళ్లు దెబ్బతినగా 9,168 గృహాల్లోకి వరదనీరు చేరిందన్నారు. ముందస్తుగా అప్రమత్తమై 2,440మందిని పునరావాసకేంద్రాలకు తరలించా మన్నా రు. బాధితుల కుటుంబాలకు 25కేజీల బియ్యం, కందిపప్పు, పామా యిల్‌, ఉల్లిపాయలు, బంగాళదుంపలు తదితర సరుకులు పంపిణీ చేశామన్నారు. 10,559హెక్టార్లలో వ్యవసాయపంటలు, 9,385 హెక్టార్ల లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. ఇంకా పంటనష్టం లెక్కింపు కొనసాగుతోందన్నారు. మత్స్యకారులకు సంబంధించి మూడు పడవలు, 103వలలు దెబ్బతిన్నాయన్నారు. రాయపూడి పెదలంక పాడి రైతులకు 25 కేజీల చొప్పున 250టన్నుల దాణా పంపిణీ చేశామన్నారు. ఈ నెలలో వచ్చినవరదలకు సంబంధించిన నష్టపరి హారం నవంబరు 15కి వస్తుందన్నారు. సమావేశంలో జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, నరసరావుపేట సబ్‌కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపుర్‌, జేడీఏ విజయభారతి, ఉద్యానశాఖ డీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-24T10:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising