షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లాలంటే.. పరీక్ష చేయించుకోవాల్సిందే!
ABN, First Publish Date - 2020-03-16T07:18:33+05:30
ప్రస్తుతం కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. వారం రోజుల నుంచి..
అధిక జ్వరంతో మాల్స్‌కు వస్తే నో ఎంట్రీ
ద్వారాల వద్దే జ్వరాన్ని గుర్తించే ధర్మోస్కాన్ పరీక్షలు
కరోనా ప్రాథమిక లక్షణం జ్వరం
గుంటూరు(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. వారం రోజుల నుంచి మన రాష్ట్రంలోను, మన జిల్లాలో కూడా భయాందోళనతోనే గడుపుతున్నారు. దీనికి కారణాలు అనేకం... అయితే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే లక్షణాలు పుష్కలంగా ఉండడంతో వ్యాపారస్తులు తమ వ్యాపారాల మనుగడ కోసం వారిని తమ వ్యాపార ప్రదేశాల్లోకి వెళ్ళనివ్వకుండా చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు అదే ధర్మోస్కాన్ పరీక్షలు... కరోనా వ్యాధి శరీరంలో ఉన్న వారికి దగ్గు, జలుబుతో పాటు 102 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక వేడి ఉండడం సహజ లక్షణం. దీనినే ప్రస్తుతం షాపింగ్ మాల్స్ వద్ద కరోనా ప్రాథమిక పరీక్షగా తీసుకుంటున్నారు.
వాస్తవానికి కరోనా నిర్ధారణ పరీక్ష అత్యంత వ్యయం, సమయంతో కూడుకున్నది. వ్యాపార ప్రదేశాల్లోకి వచ్చే వారందరికీ ఈ పరీక్ష రియల్‌టైమ్ పీసీఆర్‌ను ప్రస్తుతం సిమ్స్‌లోను, తెలంగాణ, పూణేల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. అంత అవకాశం లేదుకాబట్టి షాపింగ్ మాల్స్, విద్యాసంస్థల యజమానులు ధర్మోస్కాన్‌లను ఏర్పాటుచేసుకున్నారు. కేవలం వేల రూపాయల ఖర్చుతో ఈ పరికరం లభ్యమవుతుంది. ఇది శరీరాన్ని తాకకుండానే ప్రత్యేక కిరణాల ద్వారా ఒంట్లో ఉష్ణోగ్రతను తెలుపుతుంది. 36.6 ఫారెన్ హీట్‌లో కన్నా అంటే మన భాషలో 102 డిగ్రీల సెల్సియస్ జ్వరం అన్న మాట. అంతకన్నా అధికంగా ఉంటే వారిని షాపింగ్ మాల్‌లోకి రానివ్వడం లేదు. దీంతో మిగిలిన వారికి రక్షణ ఏర్పర్చగలమని భావిస్తున్నారు.
కరోనా నివారణకు ఆర్టీసీ ముందస్తు చర్యలు.. లాంగ్ సర్వీసు బస్సులకు సెల్యూషన్ స్ర్పే
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ కట్టడి ఆర్టీసీ చర్యలకు ఉపక్రమించింది. నిత్యం ప్రయాణీకుల రాకపోకలతో రద్దీగా ఉండే బస్టాండ్‌లతో పాటు బస్సులలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు సెల్యూషన్‌ను స్ర్పే చేస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం గుంటూరు-1 డిపో నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులకు డిఫెన్‌సెక్యువ్ సెల్యూషన్‌ను స్ర్పే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, తిరుపతి వంటి దూర ప్రాంతాల సర్వీసులకు ఈ తరహా చర్యలు తీసుకుంటున్నారు.
ఆదివారం డిపోలోని సిబ్బంది హైదరాబాద్ సర్వీసులకు సెల్యూషన్‌ను స్ర్పే చేస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఏసీ సర్వీసులు రద్దు చేయటం లేదని, అవసరమైన మేర చర్యలను తీసుకుంటున్నట్లు ఏటీఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బస్టాండ్‌లో కూడా ప్రజలు రద్దీగా ఉండే చోట సెల్యూషన్‌ను స్ర్పే చేస్తున్నామన్నారు. మరో వైపు సిబ్బందితో పాటు ప్రయాణికులకు కూడా హోమియో మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
కరోనా లక్షణాలు లేవు: డాక్టర్ హుస్యానాయక్
అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి వచ్చిన గుండా నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హుస్యానాయక్ నిర్ధారించారు. వారు నాలుగు నెలల పాటు అమెరికాలో ఉండి ఈనెల 14న తుమృకోటకు చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కూడా వివిధ రకాల పరీక్షలు చేశారన్నారు. ఏఎన్‌ఎంల పర్యవేక్షణలో ఉంచామన్నారు.
Updated Date - 2020-03-16T07:18:33+05:30 IST