ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం ఇవ్వకుంటే ఉద్యమమే

ABN, First Publish Date - 2020-12-02T05:03:12+05:30

రైతన్న కష్టాల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం మానేసిందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల, డిసెంబరు1:  రైతన్న కష్టాల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం మానేసిందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.  మంగళవారం వీరాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో  వ్యవసాయాధికారులెవరూ ఇంతవరకు పంటనష్టాన్ని అంచనా వేసేందుకు రాకపోవటం శోచనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది పంట నష్టపరిహారం కూడా ఇప్పటికీ ఇవ్వకపోవటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించిన తెలుగుదేశం సభ్యులను, మాజీ సీఎం చంద్రబాబును సస్పెండ్‌ చేయటం శోచనీయమన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.50వేలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. వారం, పదిరోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే రైతులతో కలసి ఢిల్లీ ముట్టడి తరహాలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  రైతులకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 


Updated Date - 2020-12-02T05:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising