ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది

ABN, First Publish Date - 2020-12-02T05:02:22+05:30

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను జగన్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

గుంటూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులను జగన్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. మంగళవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. 2019-20 సంవత్సరాలకు గాను ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతోనే రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఆధారాల సహా అసెంబ్లీలో బయటపెట్టినందుకే టీడీపీ అధినేత చంద్రబాబును సస్పెడ్‌ చేశారని మండిపడ్డారు. టీడీపీ ఆందోళనతోనే అర్ధరాత్రి ఇన్స్యూరెన్స్‌ కంపెనీలకు ప్రీమియం చెల్లించాలని జీవో ఇచ్చినట్లు తెలిపారు. రైతుల కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఆనందబాబు స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-02T05:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising