ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్ష కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-06-07T07:28:38+05:30

ఆంక్షల సడలింపు దృష్ట్యా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత ఎక్కువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆంక్షల సడలింపు దృష్ట్యా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించనున్నటు కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమ, గురువారాల్లో  అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని, పెదనందిపాడు, పెదపలకలూరు, తాడేపల్లి పీహెచ్‌సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.


ప్రతి మంగళ, శుక్రవారాల్లో బాపట్ల, పొన్నూరు, నిజాంపట్నం, రేపల్లె, కొల్లూరు, అమర్తలూరు, ఈమని, చేబ్రోలు, నరసరావుపేట, నకరికలు, యడ్లపాడు, చిలకలూరిపేట, వినుకకొండ, బొల్లాపల్లి పీహెచ్‌సీల్లో.. ప్రతీ సోమ, గురువారాల్లో మాచర్ల, కారంపూడి, దుర్గి, దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల పీహెచ్‌సీల పరిధిలో,  ప్రతి మంగళ, శుక్రవారంలలో తెనాలి అర్బన్‌, సంగంజాగర్లమూడి, కొలకలూరు, యడ్లపల్లి, వేటపాలెం, వేమూరు, చుండూరు పీహెచ్‌సీలను కవర్‌ చేస్తూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


శనివారం ఆయన గుంటూరు నగరంలోని ఐపీడీ కాలనీలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో జరుగుతున్న కోవిడ్‌-19 పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ప్రశాంతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌, మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-07T07:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising