ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సారు ఇంట్లో డ్యూటీకి.. హడల్‌!

ABN, First Publish Date - 2020-08-22T16:07:18+05:30

జిల్లాలో ఆయనో ముఖ్యమైన అధికారి. ఆ అధికారి వద్ద డ్యూటీ చేయడం అంటే ఉద్యోగులు గతంలో ఎగిరి గంతేసేవారు. ఇందుకు కారణం జిల్లా వ్యాప్తంగా అధికారులతో పరిచయా లు ఏర్పడటం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు నెలల వ్యవధిలో ఇద్దరు మృత్యువాత

ఒకరు కొవిడ్‌ సోకడంతో మరణం


గుంటూరు (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయనో ముఖ్యమైన అధికారి. ఆ అధికారి వద్ద డ్యూటీ చేయడం అంటే ఉద్యోగులు గతంలో ఎగిరి గంతేసేవారు. ఇందుకు కారణం జిల్లా వ్యాప్తంగా అధికారులతో పరిచయాలు ఏర్పడటం, అయ్యగారిని కలిసేందుకు వచ్చే కిందిస్థాయి అధికారులు, ప్రైవేటు వ్యక్తులు తిరిగి వెళ్తూ ఎంతో కొంత వీరి చేతిలో పెడుతుంటారు. దీంతో అక్కడ పోస్టింగ్‌ కోసం మంచి డిమాండ్‌ ఉంటుంది. అలాంటిది ఇటీ వల విధి నిర్వహణల్లో ఉంటూ ఇద్దరు దిగువస్థాయి ఉద్యో గులు మృత్యు వాత పడ్డారు. వారిలో ఒకరు పదిరోజుల క్రితం కొవిడ్‌తో చని పోయారు. దీంతో ఆ కీలక అధికారి వద్ద పని చేయడానికి సిబ్బంది బెంబే లెత్తుతు న్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు కూడా అవకాశం ఉంటే ప్రజా ప్రతినిధు లతో చెప్పించుకొని అయినా వేరే ఆఫీసుకు బదిలీపై వెళ్లిపోదా మన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.


ఈ కీలక అధికారి కార్యాలయంలో  ఏకంగా 10 మందికి పైగా ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. అంతకు రెం డు నెలల ముందు మరో ఉద్యోగి హఠాన్మరణం పాలయ్యారు. దీంతో మిగ తా ఉద్యోగు ల్లో భయం ఏర్పడింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘ టనలు జరగ లేదని సిబ్బంది చర్చించుకొంటున్నారు. ఇదిలావుంటే గత నాలుగైదు రోజులు గా ఆ అధికారి బదిలీ కానున్నారన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నేతలతో ఆయనకు సత్సంబంధాలు లేవు. వారికి అంత గా గౌరవం ఇవ్వడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణం చేతనే ఆయన్ని బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-08-22T16:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising