ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక అభివృద్ధి సాధించాలి

ABN, First Publish Date - 2020-05-30T09:25:01+05:30

నిరుపేద కుటుంబాల జీవనోపాధి కోసం రాయితీపై ప్రభుత్వం అందించే యూనిట్లను సద్వినియోగపరుచుకుని ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాన్లు, కార్లు పంపిణీలో హోంమంత్రి సుచరిత


గుంటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): నిరుపేద కుటుంబాల జీవనోపాధి కోసం రాయితీపై ప్రభుత్వం అందించే యూనిట్లను సద్వినియోగపరుచుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద లీడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో చర్మకారులకు మొబైల్‌ కార్గో వ్యాన్‌ స్కీం ద్వారా వాహనాలు, ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కార్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ గతంలో చర్మకారులకు ఉపాధి కోసం రోడ్డు సైడు బంకులు ఇచ్చేవారని, జగన్‌ సీఎం అయిన తర్వాత అర్హులైన వారిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.8.50 లక్షల విలువ చేసే కార్గో వ్యాన్‌ని అందించారన్నారు. ఈ వాహనంతో పాటు కుట్టుమిషన్‌, ముడి సరుకు, టూల్‌కిట్‌, పినిపెడ్‌ గూడ్స్‌ అందిస్తోన్నారని చెప్పారు.


మొత్తం విలువలో 35 శాతం పరిశ్రమల ప్రోత్సాహక రాయితీని, మిగిలిన మొత్తాన్ని ఏడేళ్లలో లీడ్‌క్యాప్‌కు చెల్లించేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అర్హులైన డ్రైవర్లకు కార్లను రాయితీపై బ్యాంకు రుణం ద్వారా అందిస్తోన్నామన్నారు. కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ 14 మంది చర్మకారులకు వ్యాన్లు, 23 మందికి కార్లను స్వయం ఉపాధి కోసం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కిలారి రోశయ్య, మద్ధాళి గిరిధర్‌, మహమ్మద్‌ ముస్తఫా, మేరుగ నాగార్జున, డీఆర్‌వో సత్యన్నారాయణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ధనుంజయ, లీడ్‌క్యాప్‌ మేనేజర్‌ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T09:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising