ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా.. సందడి

ABN, First Publish Date - 2020-10-25T10:21:56+05:30

డుపై విజయమే విజయ దశమి.. విజయానికి ప్రతీకగా దేశమంతా జరుపుకునే విశేషమైన పండుగ ఇది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మవారి ఆలయాల్లో పండుగ శోభ

నేడు విజయదశమి


(ఆంధ్రజ్యోతి, గుంటూరు):చెడుపై విజయమే విజయ దశమి.. విజయానికి ప్రతీకగా దేశమంతా జరుపుకునే విశేషమైన పండుగ ఇది... సకల దేవతల శక్తి స్వరూపిణిగా అమ్మవారు అవతరించి మహిషాసురుని వధించిన రోజుగా వేడుకలు నిర్వహిస్తారు. ఇదే రోజున శ్రీరాముడు రావణాసుడిని సంహరించినట్టుగా చెబుతారు. విజయదశమి రోజునే అర్జునుడు కౌరవ సేవలను అంతమొందించినట్టుగా కథనం... దురష్టసంహారం జరిగిన రోజుఆ విజయాలకు ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటారు.. నవరాత్రులు ముగిశాయి. పదోరోజు.. నేడు విజయదశమి వేడుకలకు అంతా సిద్ధమయ్యారు.


విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాలన్నీ శోభ సంతరించున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలతో అమ్మవార్లను పూజించి విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు. అమరావతి, కాకాని తదితర పుణ్యక్షేత్రాలను విజయదశమి వేడుకలు సర్వం సిద్ధం చేశారు.  దసరాను పురస్కరించుకొని శనివారం సాయంత్రం అన్ని మార్కెట్లు కళకళాడాయి. ప్రధానంగా ఎలకా్ట్రనిక్‌ వస్తువుల అమ్మకాలు, బంగారం వస్త్ర దుకాణాల్లో సందడి నెలకొంది. అలానే పూల, పండ్ల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. 

Updated Date - 2020-10-25T10:21:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising