ఎరువు తయారీ, మొక్కల పెంపకం అభినందనీయం
ABN, First Publish Date - 2020-11-14T04:48:46+05:30
జిల్లా జైలులో వ్యర్ధాలను సద్వినియోగం చేసుకుంటూ ఎరువు తయారీ, మొక్కల పెంపకం అభినందనీయం అని నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు.
కమిషనర్ అనురాధ
గుంటూరు(కార్పొరేషన్) నవంబర్ 13: జిల్లా జైలులో వ్యర్ధాలను సద్వినియోగం చేసుకుంటూ ఎరువు తయారీ, మొక్కల పెంపకం అభినందనీయం అని నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. జిల్లా జైలులో జైలు సూపరిండెంట్ హంసపాల్‌తో కలిసి గార్డెనింగ్, కంపోస్ట్ తయారీని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ జైలులో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను, కూరగాయల, ఆకుకూరల చెత్తను, చెట్ల ఆకులను ప్రత్యేకంగా విండ్రో కంపోస్ట్ పద్ధతిలో ఎరువుగా మార్చే తీరు బాగుందన్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసపాల్ మాట్లాడుతూ జైలులోని చెత్తతోనే ఎటువంటి రసాయనాలు, క్రిమిసంహారక మందులు లేకుండా కూరగాయలు పండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ డి.శ్రీనివాస్, ఎస్‌ఎస్ రాంబాబు, జైలర్లు శంకరరావు, కిరణ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రఘురాం, ఏఈ అనూష, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.
రోడ్లపై చెత్తవేస్తున్న దుకాణదారులపై చర్యలు
రోడ్లు, కాలువలు ఆక్రమించి చెత్త కాలువల్లో వేస్తున్న దుకాణాలు, బడ్డీ బంకులు, టీషాపులను వెంటనే తొలగించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ అధికార్లను ఆదేశించారు. రోజువారి పర్యటనలో భాగంగా బ్రాడీపేటలో పారిశుధ్య, అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా ఉదయం ప్రదాన వీధులు స్వీపింగ్ చేసి, 7 గంటల కల్లా డోర్ టు డోర్ చెత్త సేకరణ చేసేలా ఎన్విరాన్మెంట్ కార్యదరులు పర్యవేక్షించాలన్నారు. పర్యటనలో ఏఈ అనుష, శానిటరీ ఇన్‌స్పెక్టరు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T04:48:46+05:30 IST