ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిషేధాజ్ఞలు మరింత కఠినతరం

ABN, First Publish Date - 2020-03-29T09:53:13+05:30

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో పాటు గుంటూరు నగరంలో రెండో కేసు వెలుగు చూడడంతో పోలీసులు నిషేధాజ్ఞలను మరింత కఠినతరం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనవసరంగా రోడ్లపైకి వస్తే వదిలేది లేదు 

అన్ని సెంటర్లలో విస్తృత తనిఖీలు... కేసులు 

అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ


గుంటూరు, మార్చి 27: కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో పాటు గుంటూరు నగరంలో రెండో కేసు వెలుగు చూడడంతో పోలీసులు నిషేధాజ్ఞలను మరింత కఠినతరం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయాలని అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాలు జారీచేశారు. అర్బన్‌ పరిధిలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేశారు.


అనవసరంగా రోడ్లపైకి ఎవరూ రాకుండా కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశించారు. నిత్యావసరవస్తువులు కానీ, ఆసుపత్రులకు గాని వెళ్ళాల్సినవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో బయటకు రావాలని రామకృష్ణ అన్నారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు మాత్రమే రావాలని, కార్లలో ఇద్దరికి మించి ఉండరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలంతా ఇళ్ళకే పరిమితం కావాలని స్పష్టంచేశారు. అర్బన్‌ పరిధిలోకి అత్యవసర సమయాల్లో తప్ప విజయవాడ నగరం వైపు నుంచి కానీ, రూరల్‌ జిల్లా పరిధి నుంచి కానీ ప్రవేశించవద్దని ఆదేశించారు.  తనిఖీ సందర్భంగా పట్టుబడిన వాహనాలను లాక్‌డౌన్‌ తరువాతే సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని డీఐజీ ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పట్టుబడితే వారిని రిమాండ్‌కు పంపాలని ఆదేశించారు.



 ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధులను ఆపవద్దని డీఐజీ రామకృష్ణ అధికారులను ఆదేశించారు. రైల్వే, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను విధులకు వెళ్ళి వచ్చే సమయంలో అనుమతించాలన్నారు. వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందిని విధి నిర్వహణ నిమిత్తం రాకపోకలకు అనుమతులు ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు గంగాధరం, ఈశ్వరరావు, మనోహరరావు, డీఎస్పీలు బాలసుందరరావు, బీవీ రామారావు, వీవీ రమణకుమార్‌, బి.సీతారామయ్య, ఎం.కమలాకరరావు, పి.శ్రీనివాసరావు, ఎ.లక్ష్మీనారాయణ, కె.ప్రకాష్‌బాబుతోపాటు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T09:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising