ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటప్పకొండలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-02-20T08:05:44+05:30

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఏకాదశి పండుగను పురస్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుంచే వేలాదిగా భక్తులు కోటప్పకొండకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటప్పకొండ (నరసరావుపేట), ఫిబ్రవరి 19: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఏకాదశి పండుగను పురస్కరించుకొని  భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుంచే వేలాదిగా భక్తులు కోటప్పకొండకు తరలి వచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రి రోజున శుక్రవారం త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమ య్యాయి. మొక్కుబడి ప్రభలతో భక్తులు కొండకు తరలి వచ్చారు. నరసరావుపేట నుంచి చిన్నారులు కాలి నడకన ప్రభలతో కోటయ్య సన్నిధికి చేరుకు న్నారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. కొండ దిగువన సోపాన మార్గం వద్ద ఉన్న విఘ్నేశ్వర  స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి వందలాది మంది మెట్ల పూజ చేశారు. సోపాన మార్గంలో ఉన్న ఆనంద వల్లి ఆలయంలోనూ పూజలు చేశారు. ధ్యాన శివుడు, నాగేంద్ర స్వామి పుట్ట వద్ద పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. పొంగళ్ళు చేసి స్వామికి సమర్పించారు. శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం క్యూలో భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు అభిషేక మండ పంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. చిట్టిపొట్టి ప్రభలు కొండ దిగువన కొలువు దీరాయి. నరసరావుపేట పురపాలక సంఘం ప్రభ కోటప్పకొండకు చేరుకుంది. స్వామి దర్శనం అనంతరం భక్తులు పర్యాటక కేంద్రా న్ని సందర్శించారు. కొండ దిగువన తల నీలాలు సమ ర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 


ఆలయ ఈవో రామ కోటిరెడ్డి, పాలక మండలి చైర్మన్‌ రామ క్రిష్ణ కొండలరావు దేవస్థానం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. నరసరావుపేటకు చెందిన శ్రీ షిరిడీ సాయి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ, మంచి నీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. శాసన సభ్యుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. 


తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించిన: ఎమ్మెల్యే

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను శాసన సభ్యుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో కలసి పరిశీలించారు. త్రికోటేశ్వర స్వామి అలయ ప్రాంగణం, పర్యాటక కేంద్రం, కొండ దిగువన జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచన లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరునాళ్ళకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి తిరునా ళ్లను విజయవంతం చేయాలని కోరారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2020-02-20T08:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising