ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

ABN, First Publish Date - 2020-11-16T05:08:07+05:30

బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సంగడిగుంట), నవంబరు15:  బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ తెలిపారు.  గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేబీ రాఘవులు అధ్యక్షతన రాజకీయ ప్రచార యాత్రల ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే కేంద్రానికి వ్యతిరేకంగా వైసీపీ, టీడీపీ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.నేతాజి, ఎం.రవి, కాకుమాను నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఈమని అప్పారావు, నళనీకాంద్‌, ఎస్‌ఎస్‌ చెంగయ్య, వెంకటరెడ్డి, బి.కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-16T05:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising