ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్షసాధింపు ధోరణితో జగన్‌ పాలన

ABN, First Publish Date - 2020-12-27T14:35:27+05:30

ప్రజా సంక్షమం పక్కనపెట్టి కక్షసాధింపుతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూములిచ్చిన రైతులపై తప్పుడు కేసులు 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


తుళ్లూరు(గుంటూరు): ప్రజా సంక్షమం పక్కనపెట్టి కక్షసాధింపుతో జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం రాజధానిలో రైతు ధర్నా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తుళ్లూరు రైతు శిబిరంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రైతులను జైలుకు పంపుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నారు. అమరావతి రైతు చిహ్నం ఆకుపచ్చ కండువాలను ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు అందజేసి  అమరావతి రైతులకు మద్దతు ఇవ్వమని కోరతామన్నారు. వారిని రాజధానిలో పర్యటించి సంఘీభావం తెలపాలని కోరతామని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిగి వచ్చి రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పాలన్నారు. 


లేదంటే 13 జిల్లాల నుంచి ప్రజలను కూడ గట్టి ఢిల్లీలో  పోరాటం చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో అమరావతి ఉద్యమం తీసుకెళతామన్నారు. రైతులను హింసిస్తూ ముఖ్యమంత్రి రాష్ట్ర పాలన చేయటం సిగ్గు చేటన్నారు. సీపీఐ ఎప్పుడూ అమరావతి రైతులకు అండగా ఉంటుందని మరో సారి స్పష్టం చేశారు.  రైతుల త్యాగాలు ఊరికేపోవన్నారు. మనోఽధెర్యం కోల్పోవద్దన్నారు. న్యాయస్థానాలలో రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ మహిళా నాయకురాలు అక్కినేని వ నజా, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ కుమార్‌ తదితరులు రైతులకు సంఘీభావం తెలిపి అండగా ఉంటామని స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-27T14:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising