ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ అంతరాష్ట్ర చెక్‌పోస్టును సందర్శించిన ఎస్పీ

ABN, First Publish Date - 2020-03-27T09:28:19+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా టీ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్రీయ చెక్‌పోస్టును రూరల్‌ జిల్లా ఎస్పీ విజయరావు గురువారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురిసౌత్‌, మార్చి 26: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా టీ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్రీయ చెక్‌పోస్టును  రూరల్‌ జిల్లా ఎస్పీ విజయరావు గురువారం సందర్శించారు. నఈ చెక్‌పోస్టు గుండా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు తరలివెళ్తున్నారనే సమాచారం మేరకు ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ వైపు నుంచి వస్తున్న వాహనాలను ఆంధ్ర వైపు పంపవద్దన్నారు. విధులను సక్రమంగా నిర్వహించాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, పొన్నూరు సీఐ ప్రేమయ్య, విజయపురిసౌత్‌ ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌, రాజశేఖర్‌, సిబ్బంది ఉన్నారు. 


ప్రయాణికుల ఇక్కట్లు

తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లు ప్రైవేటు కంపెనీలను మూసివేయడంతో సుమారు 2వేల మంది దాకా ప్రయాణికులు గురువారం తెల్లవారుజామున నాగార్జునసాగర్‌ నూతన బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం అనుమతించినా, ఆంధ్ర ప్రాంత అధికారులు మాత్రం వారిని వెనక్కు పంపారు. దీంతో తెలంగాణ పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్లిపోవాలి అని సూచించారు. చేసేది లేక హాలియా, పెదవూర, పైలాన్‌ కాలనీల్లోని పలు వీధుల్లో వాహనాలను నిలిపి ఎలాగైనా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్నారు.  


టెయిల్‌పాండ్‌ బ్రిడ్జి వద్ద ఆంధ్రావాసుల అష్టకష్టాలు

ఆంధ్రా, తెలంగాణ రాష్ర్టాలకు వారధిగా ఉన్న సత్రశాల నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు బ్రిడ్జి వద్ద ఎస్‌పీఎఫ్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు) సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆంధ్రావాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, చదువుకునే నిమిత్తం వెళ్లిన పల్నాడులోని వివిధ ప్రాంతాలవారు స్వగ్రామాలకు పయనంకాగా... సరిహద్దుల్లో వీరికి చుక్కెదురైంది. బ్రిడ్జి మీద నుంచి పోలీసులు అనుమతించకపోవడంతో నీళ్లు లేని కృష్ణానదిలో నడిచి పాతబ్రిడ్జి మీద నుంచి సత్రశాల పుణ్యక్షేత్రంలోని వివిధ అన్నదాన సత్రాల్లో తలదాచుకున్నారు.

Updated Date - 2020-03-27T09:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising