ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటి సర్వే వేగవంతం

ABN, First Publish Date - 2020-04-02T09:11:51+05:30

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వలంటీర్లు ఇంటింటి సర్వే సమగ్రంగా, వేగంగా సేకరించాలని, సేకరించిన సమాచారాన్ని సంబంధిత యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిషనర్‌ అనురాధ ఆదేశాలు


గుంటూరు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 1: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో వలంటీర్లు ఇంటింటి సర్వే సమగ్రంగా, వేగంగా సేకరించాలని, సేకరించిన సమాచారాన్ని సంబంధిత యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్ధ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులతో సర్వే వేగవంతంపై ప్రత్యేక సమావేశం జరిగింది. కమిషనర్‌ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆరోగ్యం, ఈ మధ్యకాలంలో ప్రయాణ వివరాలను పూర్తిగా సేకరించాలన్నారు. ఏ ఇంటిలోనైనా కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఒక్కో నోడల్‌ అధికారికి ఒక మున్సిపల్‌ టీచర్‌ని కేటాయిస్తామన్నారు.


సచివాలయ పరిధిలోని ఒక్కో సెక్రటరీకి నలుగురైదుగురు వలంటీర్లను కేటాయించి వారిలో క్షేత్రస్ధాయిలో సమన్వయం చేసుకుంటూ సర్వే చేయాలన్నారు. మెప్మా ఆర్పీలు కూడా సర్వేలో ఉంటారని, వారిని వలంటీర్లు లేని సచివాలయాలకు కేటాయించాలన్నారు. సర్వే గురువారం సాయంత్రానికి పూర్తికావాలని తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ కె.భాగ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు, ఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీదేవి, నోడల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


పలు ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటన

కరోనా వైరస్‌ నమోదు ప్రాంతాల్లో కమిషనర్‌ అనురాధ పర్యటించి ప్రతి ఇంటి గోడలు, గేట్లు, రహదారులపై రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నగరప్రజలు ఇళ్ళనుంచి బయటకు రావద్దని ఈ సందర్భంగా కమిషనర్‌ కోరారు. మంగళదాస్‌నగర్‌, లాంచస్టర్‌రోడ్డు, వెంకటేశ్వరకాలనీ, రాజగోపాల్‌నగర్‌, ఆనందపేట, సంగడిగుంట, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించి జపాన్‌ టెక్నాలజీ స్ర్పేయర్లతో కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో ద్రావణాన్ని చల్లించారు. బుధవారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన జపాన్‌ స్ర్పేయర్లతో 2వేల లీటర్ల సామర్ధ్యంగల ట్యాంకర్లతో 62 స్ర్పేయర్ల ద్వారా బ్లీచింగ్‌, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లిస్తున్నారు. 

Updated Date - 2020-04-02T09:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising