ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో కోయంబేడు కాకుండా.. మార్కెట్‌లో అందరికీ పరీక్షలు

ABN, First Publish Date - 2020-05-30T17:24:23+05:30

గుంటూరు నగర సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోల్‌ సేల్‌ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, హమాలీలు, గుమాస్తా లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగర సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోల్‌ సేల్‌ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, హమాలీలు, గుమాస్తా లకు కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయిం చింది. శుక్రవారం సాయంత్రమే ఈ ప్రక్రియని మార్కెట్‌లోనే ప్రారం భించారు. ట్రూనాట్‌ కిట్‌ల ద్వారా వైద్యులు అక్కడి వ్యాపారులు, హమాలీల నుంచి కొవిడ్‌-19 శాంపిల్స్‌ సేకరించారు. హోల్‌సేల్‌ కూర గాయల మార్కెట్‌కి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని రకాల సరుకులు వస్తుంటాయి. దీంతో వారికి ఇక్కడి వ్యాపారులు, హమాలీలతో కాంటాక్ట్స్‌ ఏర్పడటం సహ జంగానే జరుగుతుంది. ఇది కూడా జీఎన్‌టీ రోడ్డు హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారికి కరోనా సోకడానికి కారణం అయి ఉండొచ్చని అధికా రులు అనుమానిస్తున్నారు.


తమిళనాడు కోయంబేడు మార్కెట్‌లో కరోనా వ్యాప్తి చెందిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యం త్రాంగం ముందుజాగ్రత్తగా ఇక్కడికి వచ్చే వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక్కడి వ్యాపారులు, హమాలీలు అంగీ కరించడంతో శుక్రవారం సాయంత్రం జీజీహెచ్‌ వైద్యులు మార్కెట్‌ వద్దకే వెళ్లి ఆధార్‌ నెంబర్ల వారీగా కరోనా పరీక్షలు చేశారు. వీటి రిపోర్టులు ఆది/సోమవారం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలానే ఈ మార్కెట్‌కి అనుబంధంగా గుంటూరులోని 15 ప్రాంతాల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లు కూడా ఉన్నాయి. వాటిల్లోని వ్యాపారులకు రెండో దశలో పరీక్షలు చేసే అవకాశం ఉన్నది.

Updated Date - 2020-05-30T17:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising