ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా... 212

ABN, First Publish Date - 2020-11-13T05:43:39+05:30

జిల్లాలో కొత్తగా 212 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంటూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 212 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగింది. గురువారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన 6,886 శాంపిల్స్‌ ఫలితాలను విశ్లేషించగా ఈ సంఖ్య నమోదైంది. పాజిటివ్‌ శాతం 3.08గా ఉంది. నెగెటివ్‌ శాతం 96.92(4,945 కేసులు)గా నమో దైంది. కొత్తగా మరో 4,651 మంది శాంపిల్స్‌ని పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇప్పటివరకు వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 72,013(9.17 శాతం)కి చేరుకోగా వారిలో 698 మంది(0.97 శాతం) చనిపోయారు. ప్రస్తుతం 2,105(2.92 శాతం) మాత్రమే యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొన్న వారి సంఖ్య 69,210(96.11 శాతం)కి చేరుకోవడం ఊరట కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 7,87,217 మందికి  పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ 10 లక్షల మంది జనాభాలో 1,61,315 మందికి పరీక్షలు చేశామన్నారు. కొత్తగా గుంటూరు నగరంలో 30, మంగళగిరిలో 12, తాడేపల్లిలో 11, వినుకొండలో 10, బాపట్లలో 18, రేపల్లెలో 21, తెనాలిలో 12 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు మరికొన్ని మండలాల్లో కలిపి మరో 98 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 


కరోనా పరీక్ష ఫీజు రూ.వెయ్యి మాత్రమే..

ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్ష చేయిం చుకొనేందుకు వచ్చే ప్రజల వద్ద కేవలం రూ.వెయ్యి మాత్రమే ఫీజు వసూలు చేసు కోవా లని ప్రభుత్వం స్పష్టం చేసింది. పీపీఈ కిట్‌, ఇతర ఛార్జీలన్ని కలిపి ఈ ఫీజుగా పేర్కొంది. ప్రభుత్వం పంపించే శాంపిల్స్‌ని రూ.800కే టెస్టింగ్‌ చేయాలని స్పష్టం చేసింది. 


 ఐదుగురు విద్యార్థులకు కరోనా

గుంటూరు జిల్లా వేమూరు మండలంలో బుధవారం  జరిపిన వైద్య పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. చావలి, పెరవలి, కుచ్చెళ్లపాడు, వరహాపురం గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షల్లో ఐదుగురికి వైరస్‌ సోకినట్లు వైద్యాధికారి వెంకట సురేష్‌ తెలిపారు. కుచ్చెళ్లపాడులో ఇద్దరు విద్యార్థులకు, మిగిలిన చోట్ల ఒక్కొక్క విద్యార్థికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయిం దన్నారు. ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు/ఉపాధ్యాయులు కరోనా బారిన పడితే ఆ పాఠశాలను వారం పాటు విధిగా మూసివేయాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

 . 

Updated Date - 2020-11-13T05:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising