గుంటూరు జిల్లాలో తగ్గినట్లే తగ్గి.. తీవ్రం.. కొత్తగా ఎన్ని కేసులంటే..
ABN, First Publish Date - 2020-09-14T14:38:10+05:30
కరోనా వైరస్ వ్యాప్తి జిల్లాలో కొనసాగుతోన్నది. గత కొన్ని రోజులుగా కేసులు..
కొనసాగుతోన్న వైరస్ వ్యాప్తి
జిల్లాలో 792 మందికి పాజిటివ్
గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి జిల్లాలో కొనసాగుతోన్నది. గత కొన్ని రోజులుగా కేసులు తగ్గాయి. కరోనా తగ్గుతోంది అనుకునేంతలో మళ్లీ విజృంభిస్తోం ది. శనివారం 479 కేసులు మాత్రమే నమోదు కాగా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రక టించిన గణాంకాల ప్రకారం కొత్తగా 792 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఇప్పటివరకు కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 47,246కి చేరుకున్నది. ఆదివారం కొవిడ్‌తో నలుగురు మరణించారు. దీంతో జిల్లాలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 526కి పెరిగింది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేటలో గడిచిన 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Updated Date - 2020-09-14T14:38:10+05:30 IST