ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో కొనసాగుతున్న కరోనా వైరస్‌ ఉధృతి

ABN, First Publish Date - 2020-08-06T16:33:08+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో కొనసాగుతోంది. నిత్యం వందలసంఖ్యలో కేసులు నమోదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 730 కరోనా పాజిటివ్‌ కేసులు

గుంటూరు నగరంలో 242..

మంగళగిరిలోనూ వందకు పైగా..


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి జిల్లాలో కొనసాగుతోంది. నిత్యం వందలసంఖ్యలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా 730 మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ యాస్మిన్‌ పేర్కొ న్నారు.  గుంటూరు నగరంలో అత్యధికంగా 242 కేసులు నమోదు కాగా మంగళగిరి పట్ట ణంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో వం దకు పైగా కొత్త కేసులు వచ్చాయి. బుధవారం నమోదైన వాటితో కలిపి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,170కి చేరుకొంది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకొన్న వారి సంఖ్య 4,663(23.12 శాతం)గా ఉన్నది.


ఇంకా యాక్టివ్‌లో 15,266(75.69 శాతం) ఉన్నాయి. గుంటూ రు నగరంలో కరోనా పా జిటివ్‌ కేసులు 8,008కి చేరు కోవడం ఆందో ళన కలిగిస్తోం ది. బుధవారం 9 మరణాలు చోటు చే సుకొన్నాయి. విను కొండ పట్టణంలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆర్‌ఐ జానీబాషా తెలిపారు. నరసరా వు పేటలో 50మందికి కరోనా నిర్ధారించారు. పట్టణంలోని 11 వార్డుల్లో 38 కేసులు, మం డ లంలోని వివిధ గ్రామాల్లో 12 కేసులు నమో దయ్యాయి. కొల్లిపరలో ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మెయిన్‌రోడ్డులోనే ఎక్కువ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


మండలంలో మరో 12 కేసులు నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి లక్ష్మీసుధ తెలిపారు. తెనాలి పట్టణంలో బుధవారం 24, రూరల్‌ మండలంలోని కఠెవరంలో 9, అంగలకుదురు 5, కొలకలూరు 1, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని జిల్లా ఉపవైద్యశాఖాధికారులు తెలిపారు. పొన్నూరు పట్టణం, మండలంలోని పలుగ్రామాల్లో  44 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని తహసీల్దార్‌ డి.పద్మనాభుడు తెలియచేశారు. మంగళగిరి - 102, బాపట్లలో 40, పిడుగురాళ్లలో 12, రొంపి చర్లలో 12, సత్తెనపల్లిలో 30, నకరికల్లులో 16, చిలకలూరి పేటలో 12, అమర్తలూరులో 14, దుగ్గిరాలలో 11 కేసులు నమోదయ్యాయి.


ఐదుగురు మృతి

కరోనా పాజిటివ్‌తో మాచర్ల పట్టణానికి చెందిన ముగ్గురు, మండ లంలోని రాయవరానికి చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డారు.  నూజెండ్ల మండలంలోని జంగాలపల్లికి చెందిన వ్యక్తి(35)  గుంటూరు తరలిస్తుండగా మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  

Updated Date - 2020-08-06T16:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising