ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ కనుసైగల్లో వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు: మస్తాన్ వలి

ABN, First Publish Date - 2020-11-15T17:51:30+05:30

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని  మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ సమితి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. టీడీపీ  రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారే తప్ప.. శిబిరాలలో పర్యటించి పోరాటం చేయలేదని అన్నారు. జనసేన పవన్ కళ్యాణ్  ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఉద్యమంలోకి రాలేదని...కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి  రైతులను మభ్యపెడుతుందని విమర్శించారు. నరేంద్రమోదీ ద్వంద వైఖిరి వలన రైతులు, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని మండిపడ్డారు. 


వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు నరేంద్రమోదీ కనుసైగలలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీ కూడా దైర్యంగా ముందుకు వచ్చి అమరావతి కోసం గొంతు ఎత్తడం లేదన్నారు. ఈనెల 20న మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమరావతిని రక్షించుకోవడంతో పాటు మోదీ వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి జరగాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-15T17:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising