విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ABN, First Publish Date - 2020-04-12T09:03:06+05:30
నగరంలోని కంటైన్మెంట్ ఏరియాల్లో ఎటువంటి జాప్యం లేకుండా నిత్యావసరాలు అందించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు.
కమిషనర్ చల్లా అనురాధ
గుంటూరు (కార్పొరేషన్), ఏప్రిల్ 11: నగరంలోని కంటైన్మెంట్ ఏరియాల్లో ఎటువంటి జాప్యం లేకుండా నిత్యావసరాలు అందించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లలో విధులు కేటాయించబడిన సిబ్బంది నిర్దేశిత సమయంలో విధుల్లో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
శనివారం కమిషనర్ మంగళదాస్‌నగర్, ఆర్టీసీ కాలనీ, కుమ్మరబజార్, ఆనందపేట, నల్లచెరువు, సుగాలి కాలనీ, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను, ఇంటి చుట్టుపక్కల వారిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే వెంటనే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావవాలని ఆదేశించారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ వి.సునీత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-04-12T09:03:06+05:30 IST