ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌

ABN, First Publish Date - 2020-10-23T10:11:15+05:30

వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంతో రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):  వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంతో రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందుతుందని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఈ పథకం అమలుపై గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. విద్యుత్‌ బిల్లు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు నగదు బదిలీ ద్వారా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందన్నారు.  ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసి ఫీడర్ల శాతాన్ని 89కి పెంచడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు విడదల రజని, అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, బొల్లా బ్రహ్మనాయుడు, మద్ధాళి గిరిధర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతీ రైతుకు అర్థమయ్యేలా మండల, గ్రామ కమిటీలు విద్యుత్‌ పథకం గురించి వివరించాలన్నారు. ఈ సమావేశంలో సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, ఎల్‌డీఎం ఈదర రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T10:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising