ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణ సామగ్రికి టెండర్లు

ABN, First Publish Date - 2020-12-12T05:17:58+05:30

పేదల గృహాల నిర్మాణానికి అవసరమైన భవన నిర్మాణ సామాగ్రికి ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పేదల గృహాల నిర్మాణానికి అవసరమైన భవన నిర్మాణ సామాగ్రికి ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టెరేట్‌లో ఇళ్ల పథకం భవన నిర్మాణ సామాగ్రి టెండర్‌ నిర్ధారణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా 1,63,053 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన భవన నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులు కోరితే ప్రభుత్వమే హౌసింగ్‌ డిపార్టుమెంట్‌ ద్వారా అందజేస్తుందన్నారు. టెండర్ల పరిశీలన కోసం సాంకేతిక, నిర్ధారణ, ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  సమావేశంలో జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మాధవి సుకన్య, డీపీవో కొండయ్య, సీపీడీసీఎల్‌ ఎస్‌ఈ విజయకుమార్‌, పరిశ్రమల శాఖ జీఎం పటేల్‌, మైనింగ్‌ డీడీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా ఇసుక అధికారి వెంకటేశ్వరరెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ మల్లేశ్వరరావు, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising