ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ, ఎస్టీ, బీసీలు డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్సా?

ABN, First Publish Date - 2020-12-28T05:38:47+05:30

రాజధానిలో ఒకే కులం ఉందంటూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. దానికి కౌంటర్‌గా అమరావతి జేఏసీ కన్వీనర్‌ శివారెడ్డి ఘాటుగా ఆయనకు లేఖను శనివారం రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రానికి పెద్దగా ఉంటూ అబద్ధాలు చెప్పడం సరికాదు

సీఎం జగన్‌కు అమరావతి జేఏసీ లేఖ

విజయవాడ, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): రాజధానిలో ఒకే కులం ఉందంటూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. దానికి కౌంటర్‌గా అమరావతి జేఏసీ కన్వీనర్‌ శివారెడ్డి ఘాటుగా ఆయనకు లేఖను శనివారం రాశారు. రాష్ట్రంలో 13 జిల్లాలతో చిన్నగా అయిపోయిందని, అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నానని అన్న మాటలను మరిచిపోయారా అని జగన్‌ను లేఖలో నిలదీశారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం సీఎంకు తగదని సూచించారు. రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఉన్న వారే పదేపదే అబద్ధాలు చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మిస్తామంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఒప్పందాలను ఉల్లంఘించ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమరావతి పరిరక్షణ సమితి వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను సమతూకంతో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేశారు.


Updated Date - 2020-12-28T05:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising